శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని, దాని ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ ఆదివారం వివిధ మండలాల నుంచి వచ్చిన గ్రంథాలయాధికారులు, విశ్రాంత ఉద్యోగులు కలిసి ఆదివారం ధర్నా నిర్వహించారు. అభివృద్ధి పేరుతో గ్రంథాలయ ఆస్తులను ఆక్రమించకుండా చూడాలంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమం జిల్లా గ్రంథాలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు.