శ్రీకాకుళం జిల్లాలో జూన్ 19న జెడ్పీ హాల్‌లో జిల్లా స్థాయి సంఘాల సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఈవో శ్రీధర్ రాజా శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సమావేశాల్లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష జరిపి, జిల్లా అభివృద్ధిపై విస్తృతంగా చర్చించనున్నట్లు ఆయన వివరించారు. అధికారులు, జడ్పీటీసీ సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు.