శ్రీకాకుళం నగరంలోని నాగావళి నది పరివాహక ప్రాంతాలను శనివారం జన విజ్ఞాన వేదిక సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ మాట్లాడుతూ కలెక్టర్, నగరపాలక సంస్థ అధికారులు నగరంలోని మురికి నీరు, చెత్తా చెదారాలు నదీ జలాలలో చేరకుండా చర్యలు చేపట్టాలని కోరారు. నదీ జలాలను కలుషితం చేయొద్దని పిలుపునిచ్చారు.