విశాఖపట్నం ఎన్. వి. గ్రాండ్ హోటల్ యజమానులు నారాయణ శెట్టి మురళి కృష్ణ, వసంతకుమారి దంపతులు ఆదివారం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి నిమిత్తం రూ. 1, 00, 000/-విరాళంగా అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, కార్యనిర్వహణాధికారి కె. ఎన్. వి. డి. వి. ప్రసాద్ ఈ చెక్కును స్వీకరించారు. అనంతరం దాతలకు వేదమంత్రాలతో ఆశీస్సులు అందించి, స్వామి వారి ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారని ఈఓ ప్రసాద్ తెలిపారు.