ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని బిసీ బాలికల వసతిగృహంలో మూడు మరుగుదొడ్లను నిర్మించి గురువారం ప్రారంభించారు. తాను హాస్టల్ను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడగా తమకు మూడు మరుగుదొడ్లు కావాలని కోరారని వివరించారు. వారి కోరిక మేరకు తన సొంత నిధులతో మూడు మరుగుదొడ్లను నిర్మించినట్లు వివరించారు.