శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని స్థానిక మున్సిపల్ మైదానంలో ఆదివారం నిర్వహించవలసి ఉన్న డ్వాక్రా బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా వేయడం జరిగిందని డిఆర్డిఏ పిడి పెద్దింటి కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కొన్ని అనివార్య కారణాల వలన దీనిని వాయిదా వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సోమవారం ప్రారంభించడం జరుగుతుందని దీనిని గమనించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.