శ్రీకాకుళం: దున్నపోతు దాడిలో వృద్ధుడు మృతి

51చూసినవారు
శ్రీకాకుళం: దున్నపోతు దాడిలో వృద్ధుడు మృతి
శ్రీకాకుళం గ్రామీణ మండలం కల్లేపల్లిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామ పండగలో దున్నపోతును అమ్మవారి ఆలయానికి తీసుకెళ్తుండగా కొలుసు సూర్యనారాయణ (65) అనే వ్యక్తిపై అది ఒక్కసారిగా దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన ఆయనను మొదట శ్రీకాకుళంలోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సూర్యనారాయణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్