శ్రీకాకుళం నగరంలోని శనివారం 3వరోజు ఇంజినీరింగ్ వర్కర్స్ నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్బంగా ఎఐటియుసి జిల్లా నేత టి. తిరుపతిరావు మాట్లాడుతూ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలన్నారు. హెచ్ఆర్ అమలు చేయాలని తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజినీరింగ్ సిబ్బంది, ఎఐటియుసి నాయకులు పాల్గొన్నారు.