మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’పై పనిచేస్తున్న కూలీలకు ప్రథమచికిత్స కిట్లను సోమవారం గార మండలం, వాడాడ గ్రామంలో సర్పంచ్ సుంకాన. సురేష్ అందజేసి ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉపాధి హామీ పథకం’పై యాబైజీ ఖాన్ చెరువువద్ద పనిచేస్తున్న కూలీలకు వాటర్ బోటిల్ అందించామని, వేసవిలో తగినన్నినీళ్లు శరీరానికి అవసరమన్నారు. వేతనదారులు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్త వహించాలన్నారు.