శ్రీకాకుళం పట్టణంలోని పీఎన్ కాలనీలో శుక్రవారం రాత్రి ఓ వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు అపహరణ కలకలం రేపింది. ఈశ్వరమ్మ అనే వృద్ధురాలు ఇంటికి వెళ్తుండగా బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. ఆమె ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.