శ్రీకాకుళం: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

74చూసినవారు
శ్రీకాకుళం: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం తెలిపింది. ఏప్రిల్‌ 11 నుంచి జూన్‌ 27 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 9.15 గంటలకు బయల్దేరే చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్డు రైలు (07025) మరుసటి రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుంది. ఏప్రిల్‌ 12వ తేదీ నుంచి జూన్‌ 28 వరకు ప్రతి శనివారం శ్రీకాకుళం రోడ్డు- చర్లపల్లి (07026) మధ్య నడవనుందని తెలిపింది.

సంబంధిత పోస్ట్