పాత శ్రీకాకుళంలో అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. సన్నాల పోలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. మహిళలు ముర్రాటలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కాళీమాత వేషధారణ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.