శ్రీకాకుళం ప్రజలతోపాటు, ప్రపంచ ప్రజలందరూ బాగుండాలని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు. శంకర్ అన్నారు. మంగళవారం కొత్తపేట పరిసర ప్రాంతాల ఆరాధ్య గ్రామదేవత సిరిమానోత్సవాలను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి, సంక్షేమ పథకాలను అమలుపరుస్తుందన్నారు. వైభవంగా సిరిమానోత్సవం జరగటం ఆనందంగా ఉందన్నారు.