శ్రీకాకుళం: చిట్టి తల్లికి ఎంత కష్టం వచ్చిందో..
వీరఘట్టం మండలం అడారు గ్రామానికి చెందిన 9 నెలల లక్ష్యతా శ్రీ, బ్రెయిన్ సంబంధిత వ్యాధితో శుక్రవారం కన్నుమూసింది. తల్లిదండ్రులు సంతోష్ కుమార్, హేమలత చిన్నారిని వైద్యులకు చూపించినా, బ్రెయిన్‌లో కణతుల వల్ల చికిత్స సాధ్యం కాదని డాక్టర్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం జేమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మరణించడంతో గ్రామంలో విషాదం అలముకుంది.