శ్రీకాకుళం: ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

52చూసినవారు
శ్రీకాకుళం: ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
రథ సప్తమి వేడుకల్లో భాగంగా రెండో రోజు సోమవారం శ్రీకాకుళంలో సుందరంపల్లి శ్రీనివాస్‌ శాక్సాఫోన్‌ కచేరీ, సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో బుర్రకథను ప్రదర్శించారు. మావుడూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. నగరానికి చెందిన నీరజా సుబ్రహ్మణ్యం శిష్య బృందం శ్రీనివాస కల్యాణం నృత్య రూపకం, ఆదిత్య అష్టకం, దేవీస్తుతి నృత్య రూపకాలను ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్