ప్రతి విద్యార్థికి 15వేల రూపాయలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుతం నేడు పాఠశాల అభివృద్ధి పేరుతో 2 వేల రూపాలు కోతపెట్టడం దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు హెచ్చిరించారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళం నగరంలో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి. చందు మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ప్రభుత్వం ఇచ్చే 15 వేలు విద్యార్థుల విద్యకు గొప్ప ఉపయోగపడతాయన్నారు.