విద్యతో పాటు న్యాయ విజ్ఞానం ప్రతి ఒక్కరికీ అవసరమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్. సన్యాసినాయుడు అన్నాడు. ఈనెల 9న ప్రపంచ వెట్టిచాకిరీ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని విద్యార్థులకు అవగాహన కల్పించారు. రాజ్యాంగం పిల్లలకు అనేక హక్కులు కల్పించిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు చట్టాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు.