బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయులని జ్యోతీరావు పూలే అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కొనియాడారు. జ్యోతీరావు పూలే వర్థంతి సందర్భంగా శ్రీకాకుళం జ్యోతీరావు పూలే పార్క్ లో ఉన్న జ్యోతీరావు పూలే విగ్రహానికి గురువారం పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, సామాజిక సంస్కరణలు, ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు. పూలే ఆశయాలను కొనసాగించాలని అన్నారు.