విద్యాభివృద్ధికి క్రమశిక్షణకు వేదిక గ్రంథాలయాలని గ్రంథాలయ అధికారి పి. ఉగ్రసేను పేర్కొన్నారు. శ్రీకాకుళం బలగ హడ్కో కాలనీ లో గల శాఖా గ్రంధాలయం లో వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా బుధవారం ఉదయం పిల్లలతో తెలుగు పద్యాలు చదివించి తాత్పర్యము చెప్పించారు. తదుపరి క్యారమ్స్ పై పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక వర్గాల విద్యా సాంస్కృతిక పురోగతికి వేదికగా గ్రంధాలయాలు ఉపయోగపడతాయన్నారు.