ప్రభుత్వాల ఉదాశీనత ఫలితంగా, జవసత్వాలు కోల్పోయిన రాష్ట్ర గ్రంథాలయ వ్యవస్థ పునర్వికాసానికి త్వరలో ఒక ఉద్యమం ప్రారంభించాలని విజయవాడలో జరిగిన సదస్సు తీర్మానించినట్టు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు శుక్రవారం శ్రీకాకుళంలో తెలిపారు. విజయవాడ 35వ పుస్తక మహోత్సవంలో భాగంగా పునర్వికాస సరస్సు జరిగినట్టు, కవులు, రచయితలు, ప్రముఖ ప్రచురణ సంస్థల ప్రతినిధులు హాజరైనట్టు ఆయన చెప్పారు.