హిరమండలం నుంచి వస్తున్న లారీ ఎల్ఎన్ పేట మండలం మోదుగులవలస దాటిన తర్వాత అలికాం-బత్తిలి రహదారిపై ఒక పక్కకు ఒరిగింది. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ను తప్పించబోయి అదుపుతప్పిన లారీ రోడ్డు పక్కకు ఒరిగింది. మంగళవారం జరిగిన ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.