శ్రీకాకుళం జిల్లాలో జూలై 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించనున్నారు. విద్యార్థుల పురోగతి, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ప్రతిష్ఠాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు ఆకాంక్షలను రాసి తీసుకురావాలని సూచించారు. "తల్లికి వందనం", "షైనింగ్ స్టార్స్" వంటి కార్యక్రమాలుంటాయన్నారు.