వైకాపా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని శ్రీకాకుళం జిల్లా వైకాపా యువజన విభాగం కన్వీనర్ మెంటాడా స్వరూప్ మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రజాసమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించినట్లు స్వరూప్ తెలిపారు.