సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఐదవ రోజు కార్పొరేషన్ పరిధిలోని 38, 39, 40వ వార్డుల్లో ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు, వారి సమస్యలు తెలుసుకునే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతున్నదని తెలిపారు. ఆదివారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పర్యటిస్తూ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు.