గార మండలం శ్రీకూర్మం ఆలయంలోని ఆంజనేయస్వామిని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం దర్శించుకున్నారు. ఈ మేరకు ఆంజనేయస్వామి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామి వారి ఆశీర్వచనాలను అందజేశారు.