మెళియాపుట్టి మండలం కరజాడ గ్రామానికి చెందిన కుమ్మర దామోదరరావు, దమయంతి దంపతులు ఉపాధి కోసం హైదరాబాదుకు వలస వెళ్లారు. వీరి నలుగురు కుమార్తెలు గాయత్రి (10వ తరగతి), గౌరి (6వ తరగతి), హేమ (5వ తరగతి), శిరీష (3వ తరగతి) నాన్నమ్మతో ఉంటూ స్థానిక పాఠశాలల్లో చదుతున్నారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా దమయంతికి రూ.52వేలు మంజూరైంది. ఈ సందర్భంగా తెలుగు మహిళ పాతపట్నం నియోజకవర్గ అధ్యక్షురాలు హనుమంతు హేమలత బాలికలను అభినందించారు.