శ్రీకాకుళంలో పుణ్యక్షేత్రలైన అరసవిల్లి సూర్యనారాయణ స్వామివారిని మరియు శ్రీకూర్మం కూర్మినాథ స్వామిని బుధవారం ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ సతీసమేతంగా దర్శించుకకున్నారు. ఈ సందర్భంగా వారిని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.