అంబేద్కర్ గురుకుల విద్యాలయాలలో బాల, బాలికల గురుకులాల్లో వచ్చే విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు జిల్లా సమన్వయాధికారి బాలాజీనాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 6 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ప్రవేశాల కోసం https: //apbragcet. apcfss. in సైట్ లో సందర్శించాలన్నారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు.