బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి వడ్డె ఓబన్న అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. కలెక్టరేట్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలు నెమరువేసుకున్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.