సంక్రాంతి పండుగ ప్రశాంతంగా ఆనందంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులను సహకరించాలని శ్రీకాకుళం టౌన్ డిఎస్పి వివేకానంద తెలిపారు. శనివారం శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలి వద్ద ట్రాఫిక్ ని పర్యవేక్షించారు. ప్రతి ఒక్కరూ షాపింగ్ చేసేటప్పుడు వారి వారి విలువైన వస్తువులు భద్రపరచుకోవాలని అలాగే వాహనాలు ట్రాఫిక్ సిబ్బంది సూచించిన ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాలన్నారు.