శ్రీకాకుళం నగరంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బమ్మిడి వైకుంఠరావు మర్యాదపూర్వకంగా కలిసి హాస్టల్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. పెరిగిన ధరలు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని, గ్రీన్ ఛానల్ ద్వారా బడ్జెట్ విడుదల చేయాలని, కాలేజ్ హాస్టల్స్ సర్వీస్ రూల్స్ అయ్యేవిధంగా కృషి చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో స్థానిక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అంబటి రాజారావు పాల్గొన్నారు.