శ్రీకాకుళం: విమాన ప్రమాదం.. కేంద్ర మంత్రితో మాట్లాడిన ప్రధాని

73చూసినవారు
శ్రీకాకుళం: విమాన ప్రమాదం.. కేంద్ర మంత్రితో మాట్లాడిన ప్రధాని
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి పౌరవిమానయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడితో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అవసరమైన అన్ని సహాయ చర్యలు తక్షణమే తీసుకోవాలని ప్రధాని ఆదేశించారు. ప్రమాద పరిణామాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని కూడా మంత్రి రామ్మోహన్‌ను మోదీ కోరారు.

సంబంధిత పోస్ట్