శ్రీకాకుళం: డిజిటల్ అరెస్టు కేసును ఛేదించిన పోలీసులు

74చూసినవారు
శ్రీకాకుళం: డిజిటల్ అరెస్టు కేసును ఛేదించిన పోలీసులు
డిజిటల్ అరెస్ట్ పేరిట భయపెట్టి ఓ వైద్యురాలిని మోసగించిన కేసులో నిందితులు పోలీసులకు చిక్కారు. శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద తెలిపిన వివరాల ప్రకారం, వైద్యురాలు పి. రేవతికి బెంగళూరు పోలీసుగా ఒక వ్యక్తి వీడియో కాల్ చేసి, సీబీఐ కేసు పేరుతో రూ.13.5 లక్షలు మోసగించాడు. ఆమె ఫిర్యాదుతో దర్యాప్తు చేసి, మైసూరు, కోజికోడ్‌కు చెందిన ముగ్గురిని విశాఖలో శనివారం అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్