అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో జరగనున్న రథసప్తమి వేడుకకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్పీ కేపీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం అరసవిల్లి దేవాలయాన్ని స్థానిక ఆర్డిఓ సాయి ప్రత్యూషతో కలిసి ఆయన పరిశీలించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా తగిన ఏర్పాట్లు చేసేందుకు గాను చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సిబ్బందితో ఏర్పాట్లపై చర్చించారు.