సంక్రాంతి పండగ నేపథ్యంలో జనవరి 12వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు పోలీస్ పీఈటీ పరీక్షలు నిర్వహించడం లేదని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని ఈ గమనించాలని వెల్లడించారు. మళ్లీ జనవరి 16వ తేదీ నుంచి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు యథావిథిగా దేహదారుఢ్య పరీక్షలు పునఃప్రారంభం అవుతాయని ఎస్పీ స్పష్టం చేశారు.