అరసవిల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి సందర్భంగా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఆయనే నేరుగా క్యూలైన్లను పరిశీలించారు. భక్తులు ఏ విధంగా ఆలయానికి చేరుకోవాలో వివరించారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా డ్రోన్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.