శ్రీకాకుళం: కోటి మొక్కలు నాటిన రామయ్య కృషి స్ఫూర్తిదాయకం: కేంద్రమంత్రి

54చూసినవారు
శ్రీకాకుళం: కోటి మొక్కలు నాటిన రామయ్య కృషి స్ఫూర్తిదాయకం: కేంద్రమంత్రి
తెలంగాణకు చెందిన మొక్కల ప్రేమికుడు పద్మశ్రీ రామయ్య లేరనే వార్త జీర్ణించుకోలేనిదని కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు కోటి మొక్కలు నాటిన రామయ్య కృషి స్ఫూర్తిదాయకమన్నారు. ప్రస్తుత తరానికి రామయ్య ఆదర్శప్రాయుడని, పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి ఆయన లేని లోటు భర్తీ చేయలేనిదన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు కేంద్రమంత్రి శనివారం ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్