రాష్ట్ర పండుగ రథసప్తమి వేడుకల్లో భాగంగా శ్రీ అరసవల్లి సూర్యనాయారణ స్వామి వారి సందర్శనార్ధం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికార యంత్రాంగం కృషి అభినందనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. విజయవాడ నుంచి జిల్లా అధికారులతో మాట్లాడారు. రథసప్తమి వేడుకలు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.