అందరి భాగస్వామ్యంతో రథసప్తమి పండుగను విజయవంతం చేద్దామని స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రథసప్తమి వేడుకల నిర్వహణ పై స్వచ్ఛంద సంస్థలు, భక్తుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించే కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. రథసప్తమి రాష్ట్ర పండుగగా జరుపుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, నిధులు కూడా మంజూరు చేసినట్లు చెప్పారు.