ప్రపంచం మొత్తానికి వెలుగు నిచ్చే దేవుడు సూర్యాభగవానుడని, ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలు పండగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని.. ఇదే అభిప్రాయ సేకరణ నిర్వహించడానికి ముఖ్య కారణమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ గురువారం అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించే కార్యక్రమానికి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అధ్యక్షత వహించారు.