రథసప్తమి దృష్ట్యా నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అధికారులకు సూచించారు. నగరంలోని అరసవల్లిలో అభివృద్ధి పనుల్లో భాగంగా తొలగించిన భవనాలను శనివారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర పండుగగా గుర్తించడం జిల్లా వాసుల అదృష్టమని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.