నిరుపేదలకు ఆసరా కల్పించే దిశగా ఎన్టీఆర్ భద్రత భరోసా పింఛన్లను అందజేయడం జరుగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకరరావు తెలిపారు. శనివారం శ్రీకాకుళం రూరల్ మండలంలో పలు పంచాయతీలలో ఆయన లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల ముందుగానే పింఛన్లు లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలిపారు.