శ్రీకాకుళం పట్టణం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం (ఐటీఐ) కాలేజీలో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్ లో మూడు నెలలు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ప్రారంభించారు. ఆసక్తి గల మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ వై. రామ్మోహన్ రావు శుక్రవారం తెలిపారు. ఈ శిక్షణలో చేరేందుకు శనివారంతో గడువు ముగుస్తుందని, 8వ తరగతి చదివిన వారు దీనికి అర్హులు అని చెప్పారు