శ్రీకాకుళం: రైతు సమస్యలను పరిష్కరించండి

57చూసినవారు
శ్రీకాకుళం: రైతు సమస్యలను పరిష్కరించండి
రాష్ట్ర రైతుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ తో భేటీ అయి రైతు సమస్యలపై చర్చించారు. 2014-19 మధ్యలో చేపట్టిన ఉపాధి పనులకు రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఎడిబుల్ ఆయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు వల్ల రాష్ట్రంలో పామాయిల్ రైతులు నష్టపోతున్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.

సంబంధిత పోస్ట్