ఆటల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గురువారం శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ బాలుర కళాశాలలో ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్- 2025ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్పోర్ట్స్ మీట్ పేరిట జిల్లాలోని తొమ్మిది కళాశాలలో ఇక్కడ పోటీల్లో పాల్గొనడం జరుగుతోందన్నారు.