మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని గ్రంథాలయ అధికారి పి. ఉగ్రసేను పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని బలగ హడ్కో కాలనీ లో గల శాఖా గ్రంధాలయంలో గురువారం ఉదయం వేసవి శిక్షణా శిబిరంలో భాగంగా పిల్లలకు ముందుగా నీతి కథలు, సామెతలతో పాటు కోకో పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సహాయకురాలు కె. అనిత తదితరులు పాల్గొన్నారు.