శ్రీకాకుళం: కాలభైరవాలయంలో శ్రీ చక్ర రూపేనా సిరి జ్యోతి పూజ

85చూసినవారు
శ్రీకాకుళం: కాలభైరవాలయంలో శ్రీ చక్ర రూపేనా సిరి జ్యోతి పూజ
శ్రీకాకుళం పట్టణంలోని బలగ నాగావళి నది తీరాన కొలువైన శ్రీ బాల త్రిపుర కాలభైరవాలయంలో గురువారం పౌర్ణమిని పురస్కరించుకుని పీఠం నిర్వాహకులు గణేశ్ గురూజీ ఆధ్వర్యంలో శ్రీ చక్ర రూపేనా సిరి జ్యోతి పూజ వైభవంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ చక్రం పై దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్