ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ ఒకటో తేదీన ఇచ్చాపురం నియోజకవర్గం ఈదుపురం గ్రామంలో పర్యటించనున్నారు. సిఎం పర్యటనకు భద్రత పరమైన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఐపీఎస్ గురువారం అక్కడే ఉండి ఏర్పాట్లను స్వయంగా పోలీసు అధికారులతో కలిసి పర్యవేక్షించారు. హెలిప్యాడ్, సభా వేధిక, లబ్ధిదారుల కలయిక తదితర రూట్ మ్యాపును పర్యవేక్షించి అవసరమైన బందోబస్తుని కేటాయించాలని అధికారులను ఆదేశించారు.