శ్రీకాకుళం: 'గణితం ప్రాధాన్యత విద్యార్థులు గుర్తించాలి’

81చూసినవారు
శ్రీకాకుళం: 'గణితం ప్రాధాన్యత విద్యార్థులు గుర్తించాలి’
శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. కే. సూర్యచంద్రరావు అధ్యక్షత వహించారు. జీవితంలో గణితానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, దీన్ని అందరూ గుర్తించాలని ఆయన అన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ ఎం. సుందరి "మెడిసన్ అండ్ మ్యాథమెటిక్స్" అనే అంశంపై ఆమె ఉపన్యసించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్