ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయుల ఓటర్ల నమోదు ప్రక్రియ చురుగ్గా సాగుతుందని డిఆర్వో ఎం.వెంకటేశ్వరరావు బుధవారం అన్నారు. ఈ సందర్బంగా ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ నవంబర్ 23న ఉపాధ్యాయ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేస్తామని అన్నారు. ఆ తర్వాత కూడా దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 8వ తేదీ ఆఖరని తెలిపారు.